Pensions | ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ

Pensions | ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ
ఉద్యోగుల పక్షపాతి సీఎం చంద్రబాబు – డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి
Pensions | పిట్టలవానిపాలెం, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ సూచనలతో పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి, సచివాలయ సర్వేయర్ వి. సాయి ప్రవీణ్‌తో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్లను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ గ్లోరి యానెట్ మాట్లాడుతూ సాధారణంగా ఆదివారం సెలవు దినం కావడంతో, ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబంతో సమయాన్ని గడపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఒకరోజు ముందుగానే శనివారమే పింఛన్ల పంపిణీకి ఆదేశాలిచ్చారు. ఇది చంద్రబాబు కు ఉద్యోగుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందడంతో అటు లబ్ధిదారుల్లోనూ, సెలవు దినం కలిసొచ్చినందుకు ఇటు ఉద్యోగుల్లోనూ రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోందని ఆమె తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందని.. ఇది నిజమైన మంచి ప్రభుత్వం అని ఆమె కొనియాడారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సంక్షేమ పథకాల అమలులో ప్రజలందరూ భాగస్వాములై సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
