31వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం..

31వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం..

  • సంక్షేమం,అభివృద్ధి ద్విచక్రాలపై రాష్ట్ర పురోగతి
  • కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం
  • ఉదయాన్నే తలుపు తట్టి పెన్షన్ల పంపిణీ

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట పట్టణం 31వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొని లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసమే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. సంక్షేమం మరియు అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా’ కేవలం పింఛన్ పథకం మాత్రమే కాదని, ఇది ప్రతి బలహీన వర్గానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా, ప్రతి కుటుంబానికి అండగా నిలిచే నమ్మకం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Distribution of pensions

Leave a Reply