meeting | అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

కలెక్టర్ తో సమీక్షా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
ఆంధ్రప్రభ, నిజామాబాద్ : అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం సమయ పాలనతో, నాణ్యతతో పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ నియో జకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఇలా త్రిపాఠీ తో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల స్థితి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులు, ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల, వీధి దీపాల నిర్వహణ, దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్కులు, రూ.5 కోట్ల ప్రత్యేక నిధుల విని యోగం, రూ.32 కోట్ల యూఐడీఎఫ్ జంక్షన్ అభివృ ద్ధి పనులపై వివరాలు తీసుకున్నారు. ఆస్తి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. టీయూఎఫ్ఐడీసీ ఫేజ్-1 పనుల పూర్తి స్థితి, సోనీ ఫంక్షన్ హాల్ సమీప వంతెన, కళాభవన్ నిర్మాణం, అర్సపల్లి ఆర్ఓబీ పురోగతిపై నివేదికలు సమర్పించగా, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
అమృత్ 2.0 కింద యు జి డి పనులు, నీటి సరఫరా, టి యు ఎఫ్ ఐ డి సి ఫేజ్-2 (రూ.60 కోట్లు), ప్రగతి నగర్ శ్మశాన వాటి క, రామార్తి చెరువు సుంద రీకరణ పనులపై సమీక్షిం చారు. కలెక్టర్ స్పందించి అభివృద్ధి విషయంలో అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి తప్పిదాలు జరగ కుండా అధికారులతో తరచుగా సమీక్షా సమా వేశాలు నిర్వహిస్తూ పను లు ఎలా జరుగుతు న్నా యో అవసరమైతే క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలి స్తానని ఎమ్మెల్యే కి కలెక్టర్ చెప్పారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా అంత రాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఫూలంగ్ వాగు ఆక్రమణలు తొలగింపు, నగరం కాలువ మరమ్మ తులు, బొడ్డెమ్మ చెరువు సమస్యల పరిష్కారం, ఐదు ఇంటర్నల్ పార్కుల నిర్మాణ పురోగతిపై చర్చిం చారు. ప్రభుత్వ పాఠశాల ల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి శ్రీనిధి నిధుల వినియోగం, తల్లి-శిశు సంక్షేమ ఆసు పత్రి, బస్తీ దవాఖానాల పనితీరు, ఎన్ హెచ్ ఎం నిధుల వినియోగం, అక్ర మ వైద్యులపై చర్యలపై నివేదికలు సమర్పించబ డ్డాయన్నారు. ట్రాఫిక్ పోలీస్, ఉపాధి శాఖ రంజాన్ పండగ సంద ర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరు, రోడ్డు ఆక్రమణలపై చర్య లు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విక లాంగులకు ఉద్యోగ అవకాశాలపై చర్చించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సంక్షేమ శాఖ ఆసుపత్రిలో మరమ్మ తులు, సిబ్బంది అందు బాటు, వేసవి ప్రత్యేక చర్యలు, వికలాంగులకు సహాయక పరికరాల పంపి ణీ, వృద్ధులు, పిల్లల సంక్షే మ కార్యక్రమాలపై సమీక్షిం చారు. ఇందూరు అర్బన్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్నపను లను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు.
నిధుల వినియోగంపై పారదర్శకత వహించా లన్నారు. ప్రజలకు ఇబ్బం ది కలగకుండా వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు విష యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా సంబం ధిత అధికారులకు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే ఆదే శాలు జారీ చేసారు. ముం దస్తు చర్యలు చేపట్టాల న్నారు. ప్రతి శాఖ వారా నికి ఒకసారి అభివృద్ధి పురోగతి నివేదిక సమ ర్పించాలన్నారు. నియో జకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
