27thFebCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

27thFebCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
27thFebCartoon| అమెరికా ఆర్థిక పరిస్థితి నిజంగా బలమా లేక బలహీనతా?
ట్రంప్ ధీమా వెనుక ఆత్మవిశ్వాసమా లేక అతిశయోక్తి?
సుంకాల రాజకీయాలు: ప్రపంచానికి సవాల్ లేదా సంక్షోభం?
వ్యంగ్యాస్త్రం: ఒక కార్టూన్‌లోనే సందేశం

అమెరికా ఆర్థిక స్థితిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా బింకంగా, నమ్మకంగా చెప్తున్నారు. చాలా బాగుందని…అద్భుతంగా ఉందని…అలా అయితే మరి దేశంలో అతడిపట్ల నిరసనలెందుకని పలువురు విశ్లేషకులు అంటున్నారు. తన పాలన చాలా బాగుందని తనకు తానే కితాబిచ్చుకుంటున్నారు…మళ్ళీ మళ్ళీ తానే గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినా సుంకాలూ-బింకాలూ ట్రంపు గారికి కొత్తేం కాదు కదా. అమాంతం పైకి…అంతలోనే కిందకి…అంతలోనే స్నేహం…కాసేపట్లోనే వైరం…ఇది ట్రంపు గారి వైఖరి. ఆది నుంచీ దూకుడు కనబరుస్తోన్న ట్రంప్-2 ఇటు తన దేశంలోనూ, ప్రపంచదేశాలతోనూ ఆడుకుంటున్నారు. యుద్ధాలు ఆపానని పదే పదే చెప్పుకుంటూ అభాసుపాలవడం…
నోబెల్ శాంతి బహుమతికి తనను మించిన అర్హుడెవరూ లేరని భావించడం డొనాల్డుగారికే చెల్లు. ఆర్థిక స్థితి అంత బాగుంటే పైకి పదే పదే చెప్పడం ఎందుకో…చెప్పకనే చెబుతున్న అమెరికా ఆర్థిక స్థితి పై ఆంధ్రప్రభ సంధించిన వ్యంగ్యాస్త్రం ఈ కార్టూన్.
యథాతథంగా ట్రంప్ మాటలు క్యాప్షన్ లో రాసి, అమెరికా స్థితిని ట్రంప్ సూటులో చూపించడం చమక్కు. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.
-ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
