వైసీపీ నేత బుర్రి బాబురావు మృతి..

వైసీపీ నేత బుర్రి బాబురావు మృతి..
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుర్రి బాబురావు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వెంటనే విజయవాడలోని వై.వి.ఆర్. హాస్పిటల్‌కు చేరుకుని బాబురావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ దుర్ఘటన పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుర్రి బాబురావు పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు.
