Super8| స‌మీక‌ర‌ణాలో టీమిండియా స‌మ‌రం

Super8| స‌మీక‌ర‌ణాలో టీమిండియా స‌మ‌రం

Super8| నేటి మ్యాచులు తేల్చ‌నున్న భార‌త్ భ‌విత‌వ్యం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా భ‌విత‌వ్యం నేడు తేల‌నుంది. భార‌త్ సెమీ ఫైన‌ల్ చేరుతుందా.. లేదా ఇంటి బాట ప‌డుతుందా అనేది ఇవాళ జ‌రిగే రెండు మ్యాచులు తెల్చ‌నున్నాయి. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌కుండా మ్యాచ్ ఫ‌లితాలు ఏ మాత్రం అటూ ఇటూ అయినా టీమిండియా టోర్నీ నుంచి త‌ప్పుకోవాల్సిందే. సూప‌ర్ 8లో ద‌క్షిణాఫ్రికాతో ఓడిపోవ‌డంతో భార‌త్‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. భారీ తేడాతో ఓడిపోవ‌డంతో నెట‌ర‌న్‌రేట్ కూడా మైన‌స్‌లో ఉంది. దీంతో ఇత‌ర జ‌ట్ల జ‌య‌ప‌జ‌యాల‌పై భార‌త్ ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. ఈ రోజు జ‌రిగే మ్యాచుల స‌మీక‌ర‌ణాలు ఎలా ఉండ‌బోతాయో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే..

Super8
Super8

సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో భార‌త జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. దీంతో ఇవాళ జరిగే రెండు మ్యాచ్‌లు భారత్ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్, చెన్నై వేదికగా రాత్రి 7 గంటలకు భారత్-జింబాబ్వే తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచుల‌పై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా, జింబాబ్వేపై భారత్ విజయం సాధిస్తే సెమీస్ రేసు సులభమవుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. భారత్, వెస్టిండీస్ చెరో 2 పాయింట్లతో ఉంటాయి. ఈ సంద‌ర్భంలో మార్చి 1న భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ వర్చువల్ నాకౌట్‌గా మారుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. నెట్ రన్ రేట్‌తో సంబంధం ఉండదు. ఏదేమైనా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ముందుగా జింబాబ్వేపై తప్పక గెలవాలి. ఆ తర్వాతే మిగిలిన సమీకరణాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Leave a Reply