మరోసారి బిగ్ స్క్రీన్ పై ఆనాటి మ్యాజిక్ !!

తెలుగు సినిమా నడతను మార్చిన సంచలన చిత్రం శివ. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర సయుంక్తంగా నిర్మించిన ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు.
1989 అక్టోబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా…. ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్ పైకి రానుంది. శివ మూవీ నవంబర్ 14న ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.
అయితే, ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన శివ సినిమా రూల్స్ ని బ్రేక్ చేసింది.. తెలుగు సినిమా నడతనే మార్చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా… కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దక్షిణ భారత సినీ చరిత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఒకే చిత్రంతో 100 రోజులకు పైగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించిన హీరో నాగార్జున ఒక్కడే. వైజాగ్ జగదాంబ థియేటర్ లో 120 రోజులు ఫుల్స్ తో 155 రోజులు రన్ అయ్యింది. తమిళనాడులో శివ సినిమాని ఉదయం టైటిల్ తో రిలీజ్ చేసారు. అక్కడ కూడా సంచలన విజయం సాధించడం విశేషం. ఇక మద్రాసు దేవికళ థియేటర్ లోనే 145 రోజులు ఫుల్ అయి, 259 రోజులు రన్ అవ్వడం విశేషం. ఈ రికార్డ్ ఇప్పటికీ ఇలాగే ఉంది.

Pingback: శివ – నటీనటులు.. అప్పుడు – ఇప్పుడు - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top