ఘనంగా కౌన్సిలర్ శ్రీకాంత్ జన్మదిన వేడుకలు..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 9 వ వార్డ్ కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బీసు శ్రీకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం హైదరాబాద్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సమక్షంలో వారి నివాస గృహాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ ను ఎంపీ,ఎమ్మెల్యే లు శాలువలతో సన్మానించి,స్వీట్లు తినిపించారు. అనంతరం ఎంపీ ,ఎమ్మెల్యే ల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పర్రెపాటి యుగంధర్, చెడే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
