Tragic Incident | పాపం ఒకే కుటుంబంలో ముగ్గురు…

Tragic Incident | పాపం ఒకే కుటుంబంలో ముగ్గురు…

ఆర్థిక ఇబ్బందుల వల్లేనా….?


Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద ఘటన (Tragic Incident) హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని అంబర్ పేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Three committed suicide) కు పాల్పడ్డారు. మృతులను రామరాజు (55), మాధవి (50), శశాంక్‌ (24)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహ్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా.. ముగ్గురు విగతజీవులుగా పడిపోయి కనిపించారు. వారి మృతికి ఆర్థిక ఇబ్బందులా లేక అనారోగ్య సమస్యలై ఉంటాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని అంబర్‌పేట్ పోలీసులు క్లూస్ టీమ్ తో రంగంలోకి దింపి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply