సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనం బోల్తా కొట్టడంతో.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదం నేపథ్యంలో వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.