fisheries strikes నిషేదిత అలివి వలలకు చెక్ Andhra Prabha News

fisheries strikes నిషేదిత అలివి వలలకు చెక్ Andhra Prabha News

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో మత్స్యశాఖ దాడులు
నిషేధిత అలివి వలలతో వేటపై ఉక్కుపాదం
90 కిలోల ఎండు చేపల జప్తు
వైజాగ్ జాలర్లు పరార్
గ్రామస్థుల సమక్షంలో వేలంపాట
కృష్ణానదిలో అక్రమ వేటకు కఠిన హెచ్చరిక
మత్స్య సంపద రక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ

( నందికొట్కూర్ , ఆంధ్రప్రభ)

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నిషేధిత అలివి వలలతో వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నందికొట్కూర్ మత్స్యశాఖ అధికారి భరత్ లాల్ హెచ్చరించారు.నిషేధిత వలలను వాడకుండా చెక్ పెట్టేందు‌కు జిల్లా మత్స్య శాఖ అధికారులు నడుం బిగించింది. అక్రమంగా చేపలవేట కొనసాగిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపింది. స్థానిక మత్స్యశాఖ అధికారి భరత్ లాల్ చర్యల‌కు తీసుకుంటున్నామని అన్నారు సోమవారం మత్స్య సహాయకులు లోకేష్ శాతనకోట గ్రామం నందు నిషేధిత అలివి వలలు జప్తు చేయుటకు గాను శ్రీశైలం బ్యాక్ వాటర్ నందు రైడింగ్ కి వెళ్లడం జరిగినది అన్నారు. రైడింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైజాగ్ జాలర్లు మత్స్య అధికారులు రాకను గమనించి ఎండు చేపలను అక్కడే వదిలి పారిపోవడం జరిగినది అని తెలిపారు.

అలా వదిలిన 90 కేజీల ఎండు చేపలను మత్స్య శాఖ అధికారులు జప్తు చేసుకొని వాటిని గ్రామ రెవెన్యూ అధికారి తరపున తలారి గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు గ్రామస్తుల సమక్షంలో వేలంపాట వేసి వచ్చిన మొత్తంను ప్రభుత్వమునకు చెల్లించడం జరిగినది అన్నారు. మరల నిషేధిత అలీవి వలలతో చేప పిల్లలు వేట కృష్ణానదిలో కొనసాగిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించడం జరిగినది. అంతే కాకుండా వైజాగ్ జాలర్లు శ్రీశైలం బ్యాక్ వాటర్ నందు వేట కొనసాగించకుండ చేయడంలో స్థానిక మత్స్య కారులు మత్స్య శాఖకు సహకరించవలసినదిగా కోరుచున్నానని అన్నారు.నిషేధిత వలలతో వేటాడుతున్న వారిపై కఠిన చర్యలు, వలల జప్తు జరిమానాలు విధిస్తారు.ఈ వలలు చేపల సంతానోత్పత్తిని దెబ్బతీసి, మత్స్య సంపదను నిర్వీర్యం చేస్తాయి అని అన్నారు. మత్స్యకారుల ప్రయోజనాల రక్షణ కోసం అక్రమ వేటను అడ్డుకోవడానికి మత్స్యశాఖ అధికారుల బృందాలు పర్యవేక్షణ మరియు విచారణ చేపడతాయి అని తెలిపారు.ఈ చర్యలను ఎవరైనా ఉల్లంఘిస్తే, కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి వేట వలలను స్వాధీనం చేసుకుంటారని అధికారులు హెచ్చరించారు

Leave a Reply