రోడ్డు భద్రత పై అవగాహన

రోడ్డు భద్రత పై అవగాహన

ముధోల్,ఆంధ్రప్రభ : వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని ముధోల్ సిఐ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిలా ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం ముధోల్ మండల కేంద్రంలో జాతీయ రహదారి కూడలి వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమమును నిర్వహించారు.

ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని షీఐ రవీందర్అ న్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగితే, కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుంగిపోతుందని అన్నారు. సైబర్ నేరగాళ్ల వల్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఓటీపీ, పాస్ వర్డ్స్ లాంటివి చెప్పకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ బిట్ల పెర్సిస్, ముధోల్ సర్పంచ్ షబానా ఇజాజ్, నాయకులు అఫ్రోజ్ ఖాన్, పోలీస్ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply