మహిళా శక్తిని జాగృతం చేస్తూ పథ సంచలన్

మహిళా శక్తిని జాగృతం చేస్తూ పథ సంచలన్
సంస్కారవంతమైన సమాజమే దేశానికి రక్షా
మహిళలు వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయిగా మారాలి..
ప్రతి సేవిక ధర్మరక్షణ కోసం సమయ సమర్పణ చేయాలి
తెలంగాణ ప్రాం త భౌధ్ధిక ప్రముఖ ముఖ్య వక్తగా రూప,
నిజామాబాద్ ,ఆంధ్రప్రభః సంస్కారవంతమైన సమా జమే దేశానికి రక్షా అని తెలంగాణ ప్రాంత భౌధ్ధిక ప్రముఖ్ వక్త రూప అన్నా రు. సమరసత, సమన్వ యం, సంస్కృతి సంరక్షణ మన ప్రధాన బాధ్యత అని వారు గుర్తు చేశారు. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ లో గల మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర సేవికాసమితి ఇం దూరు జిల్లా పదసంచలన కార్య క్రమం సార్వజనికో త్సవానికి తెలంగాణ ప్రాం త భౌధ్ధిక ప్రముఖ ముఖ్య వక్తగా రూప,వివేకానంద ప్రిన్సిపల్ లతా గౌడ్ లు హాజరయ్యారు.
ఏకరూప గన వేషాధార ణతో పదం పదం కలుపుతూ… మహిళా శక్తిని జాగృతం చేస్తూ నగరంలోని శివాజీ నగర్ గాజులపేట్ ,పులాం గ్ పురవీధుల గుండా సెవి కలు పథ సంచలన్ చేశారు. పుర ప్రము ఖులం దరూ పూలతో కాషాయ ధ్వజాన్ని స్వాగతిం చారు.ఈ సందర్భంగా వక్త రూప మాట్లాడుతూ ప్రతి సేవిక ధర్మరక్షణ కోసం సమయ సమర్పణ చేయాలని కోరారు. కుటుంబ విలు వలే ఈ సమాజానికి శ్రీరామ రక్షా అని సూచిం చారు.
