ఉయ్యాలవాడ అమర్ రహే

ఉయ్యాలవాడ అమర్ రహే
సిపాయిల తిరుగుబాటుకు ముందే ..
ఆంగ్లేయులపై సమర సింహనాదం
1847లోనే శిస్తులకు వ్యతిరేకం
తెలుగు నేల పౌరుషాన్ని చాటిన అపర వీరుడు
కలెక్టరేట్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళి
( మచిలీపట్నం – ఆంధ్రప్రభ)
సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆంగ్లేయుల పాలనను ఎదిరించి పోరాడిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. ఆదివారం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. .సిపాయిల తిరుగుబాటు 1857 సంవత్సరంలో జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని, ఆ పోరాటానికి 10 ఏళ్ల ముందే ఆంగ్లేయులు విధించిన అన్యాయమైన శిస్తులను భూవివాదాలకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1847 సంవత్సరంలోనే తిరుగుబాటు చేసి చివరకు వీరమరణం పొందారన్నారు.
ఆంగ్లేయుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి తెలుగువారి పౌరుషాన్ని చాటి చెప్పిన అపరవీరుడని కలెక్టర్ ప్రశంసించారు.ఆయన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యుఓ ధూర్జటి ఫణి,కలెక్టరేట్ డిప్యూటీ కలెక్టర్ నారాయణ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
