మహిళ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

మహిళ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని వెల్మకన్నె గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులనుండి మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో మహిళ సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి,రూ.2 లక్షల రూపాయల వ్యయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణానికి ఈరోజు సర్పంచ్ రావుల స్వప్న రమేష్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

మహిళ స్వాలంబనే లక్ష్యంగా పాఠశాల పరిశుభ్రత విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సర్పంచ్ రావుల స్వప్న రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగబోయిన మహేష్, వార్డు సభ్యులు,విద్యా కమిటీ చైర్మన్,ఉపాధ్యాయులు,మహిళా సంఘ ప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply