పాఠశాలకు నాణ్యమైన బియ్యం పంపాలి

పాఠశాలకు నాణ్యమైన బియ్యం పంపాలి

  • పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్

మునుగోడు, ఆంధ్రప్రభ : పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ కోసం సరఫరా చేసే బియ్యం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడులో మాట్లాడారు బడికి ముక్కిపోయిన, గడ్డకట్టిన బియ్యం వచ్చింది అంటూ ఫిర్యాదులు వస్తే, అట్టి బియ్యం సరఫరా చేసిన గిడ్డంగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా మిడ్ డే మీల్స్ బియ్యం పూర్తిగా నాణ్యతాయుతంగా ఉండాలని ఆదేశించారు.

తినడానికి అనర్హమైన బియ్యం సరఫరా చేసినట్లయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు.గిడ్డంగుల నుంచి పాఠశాలలకు బియ్యం తరలించే సమయంలో సీఆర్‌పీలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఎలాంటి అశ్రద్ధ,బాధ్యతారాహిత్యం ఉన్నా గిడ్డంగి సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బంది తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రఘునందన్ హెచ్చరించారు.
పిల్లల భోజనంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని,ఎక్కడైనా లోపాలు గమనించిన వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

Leave a Reply