Cleanly | స్వచ్ఛ రథం ప్రారంభం

Cleanly | స్వచ్ఛ రథం ప్రారంభం
Cleanly | వినుకొండ , ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్ధాల సేకరణ కోసం నిర్దేశించిన స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన పుష్ కార్ట్ లు, ఈ ఆటోస్ ను ప్రారంభించి వ్యర్ధాల సేకరణ కోసం అనుసరించాల్సిన విధానాలను సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం మేర డోర్ టు డోర్ కలెక్షన్ చేపట్టాలని ఆదేశించారు. పల్నాడు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా చేపట్టిన చిల్లీ, మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ తదితర స్టాళ్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశారు.
561 స్వయం సహాయ సంఘాలకు 100.14 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అందించారు. మొక్కజొన్న వేస్ట్‌తో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి ఉత్పత్తి వ్యయం తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు
