University | బీసీ సింహ గర్జన సభను జయప్రదం చేయండి

University | బీసీ సింహ గర్జన సభను జయప్రదం చేయండి

University | గుడివాడ, ఆంధ్రప్రభ : భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించే బీసీ సింహ గర్జన సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని బిసివై పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కోన నాగార్జున విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎన్జీవోస్ కాలనీ వద్ద బిసివై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూచిపూడి వాసుదేవరావు ఆధ్వర్యంలో సింహ గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను కోన నాగార్జున ఆవిష్కరించారు.

అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే లక్ష్యంగా బీసీవై పార్టీని స్థాపించి అణగారిన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తున్న బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోన నాగార్జున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ బీసీవై పార్టీ నాయకుడు బొల్ల ఫణి బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply