21st | అవనిగడ్డకు చాగంటి రాక

21st | అవనిగడ్డకు చాగంటి రాక
- మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేయనున్న బుద్ధప్రసాద్
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సభ
- ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయనున్న చాగంటి
- విస్తృత ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
21st | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ నెల 21వ తేదీ అవనిగడ్డకు విచ్చేయనున్నారు. బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 4గంటలకు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ నైతిక విలువల కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చాగంటి కోటేశ్వరరావుకు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేయనున్నారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
