వాకర్స్ సమస్యలు పరిష్కరిస్తా

వాకర్స్ సమస్యలు పరిష్కరిస్తా

  • మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఒడ్నాల శ్రీనివాస్

మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలోని కళాశాల మైదానంలో వాకింగ్ చేస్తున్న వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తానని మంథని మున్సిపల్ చైర్పర్సన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. గురువారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఒడ్నాల శ్రీనివాసును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా మరో ఓపెన్ జీమ్ ను గ్రౌండ్లో ఏర్పాటు చేస్తానని, వాకింగ్ ట్రాక్ ను, జిమ్ ఏరియాను ప్రతిరోజు శుభ్రం చేసే విధంగా మున్సిపల్ సిబ్బందిని నియమిస్తానని, వాకర్స్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కారం చేస్తానని, పట్టణంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

అవినీతి రహిత పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎవరు ఏ సమస్య కోసం వచ్చిన డబ్బులు తీసుకోకుండా పనిచేస్తామని ఎవరూ డబ్బులు అడిగినా ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పాలకవర్గం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకరి కుమార్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి రమేష్, వాకర్స్ అసోసియేషన్ నాయకులు పోతరాజు సమ్మయ్య, అంకరి ప్రకాష్, కొమరోజు చంద్రమోహన్, గంధం ఆంజనేయులు, ఐదు రవి, అవదానుల మోహన్ శర్మ, సతీష్, మాచిడి జనార్ధన్, సత్యనారాయణ రెడ్డి కుక్కుడపు వేణు, కొంతం మోహన్, వీరశంకర్, డిష్ రవి, బంకు శ్రీను, రాచర్ల నాగరాజు, మంథని కరుణ కృష్ణ, వేల్పుల వెంకటస్వామి, రవీందర్ రెడ్డి, అశోక్, ఆకుల వేణు, శ్రీనివాస్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply