Admissions | శభాష్ డీసీఓ సార్ …..

Admissions | శభాష్ డీసీఓ సార్ …..
- అడ్మిషన్ల కోసం వినూత్న ప్రచారం
- గురుకులాల అడ్మిషన్లకై సరికొత్త ఆలోచన
Admissions | మంథని, ఆంధ్రప్రభ : మనసుంటే మార్గం ఉంటుంది అనే పదానికి నిలువెత్తు నిదర్శనం పెద్దపెల్లి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శ్రీనాథ్ నిరూపించారు. గురుకులాల అడ్మిషన్ల కోసం ఆయన సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు స్వయంగా డీసీఓ శ్రీనాథ్, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ తో కలిసి మంథని మండలం సూరయ్య పల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు.
అర్హులైన విద్యార్థులు గురుకులాలను ఉపయోగించుకోగలరని ఆయన సూచించారు. డీసీఓ శ్రీనాథ్ ప్రచారానికి గ్రామస్తులంత ఆధ్యాంతం ఆసక్తిగా తిలకించారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వారు పట్టించుకోరు అనేది అవాస్తవం అని డీసీఓ శ్రీనాథ్ నిరూపించారు. జిల్లాస్థాయి అధికారి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం వినూత్నంగా ప్రచారం చేయడం ఆలోచించదగ్గ విషయం.
గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఈనెల 25 చివరి తేదని, అర్హులైన ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ కేంద్రం, మీ సేవలో దరఖాస్తు చేసుకోగలరని ఆయన సూచించారు. వచ్చేనెల 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలరని ఆయన సూచించారు.
