నాచుపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు
నాచుపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు
నాచుపల్లి, ఆంధ్రప్రభ: కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాల జాతర నిర్వహించారు. ఐదేళ్లకు ఒకసారి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్దోగంలో భాగంగా పోచమ్మ బోనాలు తీయడం గౌడ కులస్తుల ఆచారంగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపెల్లి అంజయ్య గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజుల అజయ్ గౌడ్, పల్లె రాంగోపాల్ గౌడ్, పల్లె రవి గౌడ్, కోల రవి గౌడ్, తాళ్ళపెల్లి విక్రమ్ గౌడ్, సాయినాథ్ గౌడ్, రంజిత్ గౌడ్, గవాస్కర్, ప్రభాకర్, గౌడ కులస్తులు పాల్గొన్నారు.
