harmoniously | శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలి..

harmoniously | శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలి..
harmoniously | బాల్కొండ,ఆంధ్రప్రభః పండుగలను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా శాంతియూతంగా జరుపుకోవాలని ఆర్మూర్ రూరల్ సీఐ గడ్డం జాన్ రెడ్డి సూచించారు. శివాజీ జయంతి, రంజాన్ సందర్భంగా బాల్కొండ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టులను నమ్మి గొడవలు సృష్టించే పరిస్థితి లేకుండా సోదరభావంతో ఉండాలని సూచించారు.
రూరల్ లో శాంతిభద్రతల సమస్య లేదని,అధికారులు విధి నిర్వహణలో వచ్చిపోయేవాళ్లేనని స్థానికంగా ఉండే ప్రజలే ఎప్పటికీ మతసామరస్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ర్యాలీలు,సభల నిర్వహణ కోసం స్థానిక గ్రామ పంచాయతీ,పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. బయటినుంచి వచ్చే అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శైలేందర్, హెడ్ కానిస్టేబుల్ లు ఠాకూర్ సింగ్, వాసుదేవ్,వివిధ రాజకీయ పార్టీ నాయకులు,కుల,మత సంఘల పెద్దలు,యువజన సంఘాల సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
