వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, ఐకెపీ ఎపీఎం గోపు కిరణ్ కుమార్ లు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్మర్ పల్లి మండలంలోని కొనాపూర్, ఇనాయత్ నగర్, అమీర్ నగర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం రూ.2,389, కామన్ రకం రూ.2,369 ఉంటుందని తెలిపారు. వరి ధాన్యం రైతులు దళారులను నమ్మి మోస పోకుండా, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు అరుణ్ రెడ్డి, సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, ఐకేపీ సీసీ ఏడేల్లి రవి, భాగ్యలక్ష్మి, పిర్య నాయకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply