సుమన్ రౌడీయిజం మానుకో

సుమన్ రౌడీయిజం మానుకో

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన రౌడీయిజాన్ని మానుకోవాలని రాష్ట్ర మంత్రి వివేక్ హితావు పలికారు. ఇవ్వాళ స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎంపీ వివేక్ తో కలిసి మంత్రి వివేక్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపల్ చెర్మెన్ ఎన్నికల్లో అపజయాన్ని జిర్ణించుకోలేని బాల్క సుమన్ తమ పై తమ కౌన్సిలర్ల పై బిఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారని ఆరోపంచారు.

క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారనికి ఒక బాధ్యత గల మెంబెర్లు గా ఎంపీ వంశీ తో కలిసి వెళ్తుంటే సుమన్ తన అనుచరులతో తమకారు పై రాళ్ళు విసిరారని మంత్రి అన్నారు. 5సంవత్సరాలు ఎంపీ గా, 5సంవత్సరాలు ఎమ్మెల్యే గా చేసిన సుమన్ రౌడీయింజని ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యన్ని ఖునిచేసాడని సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు.

Leave a Reply