BRS l పొలంలో వినూత్నంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

BRS l పొలంలో వినూత్నంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
BRS, బెజ్జంకి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను రైతులు వినూత్నంగా వ్యవసాయ పొలంలో నిర్వహించారు. మండలంలోని లక్ష్మీపుర్ గ్రామం లో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పొలంలోనే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులు ఎల్లప్పుడూ రాజులుగా ఉండాలనే కేసీఆర్ ఆశయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని రైతులు కోరుకున్నారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తన పాలనలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు బంధు, రైతు భీమా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించారన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసి రైతుల అభివృద్ధికి కృషి చేశారని వారి సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
