procession | బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు

procession | బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు

శివపార్వతుల ఊరేగింపులో భక్తులు
దారి పొడవున శివపార్వతులకు మంగళ నీరాజనాలు.

procession | కరీమాబాద్, ఆంధ్రప్రభః శ్రీ శివపార్వతుల కళ్యాణ ఊరేగింపు శివనగర్ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించారు. దారి పొడవున హరహర మహాదేవ శంభో శంకర అంటూ జేజేలు పలికార. మహాశివరాత్రి పర్వదినం రాత్రి శివపార్వతుల కళ్యాణం శివనగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ఘనంగా కన్నుల పండుగగా వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించారు. సోమవారం సాయంత్రం శివపార్వతులను బంగారు పల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడుగునా భక్తులు మంగళ నీరాజనాలు పలికారు. కైలాస వాసుడు, పార్వతి పరమేశ్వరులు తమ వీధుల గుండా బంగారు పల్లకిలో ఊరేగింపుగా తరలి వెళ్తుంటే చూసిన కనులకు పండగగా గోచరించింది. స్వామివారి కృప తమపై కురిసిందని భక్తులు తన్మయత్వం చెందారు. ఊరేగింపు అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు

Leave a Reply