CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో…

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో…

CM Revanth Reddy | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో బెల్లంపల్లి పట్టణ రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా నూతన మున్సిపల్ పాలకవర్గంతో కలిసి సమిష్టిగా కృషి చేస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం ఆయన నూతన పాలకవర్గంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన ఈ పాలకవర్గాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి, బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

రానున్న రోజుల్లో పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక నిధులతో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, టౌన్ కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు చింతల వసంత, నిచ్చకోల వంశీకృష్ణ, డీకొండ పద్మ, మత్తమారి రాయమల్లు, ఎండీ. నిజాముద్దీన్, కంకటి ప్రణీత, గాలి సుమలత, ఇప్ప కుమారస్వామి, పోలు ఉమాదేవి శ్రీనివాస్, బెత్తి శ్రావణ్ కుమార్, చిప్ప అర్చన , మేడి పున్నం చందు, నీలి హారిక, పీక ఎల్లబాయి, పోలుఉమాదేవి, సుఖేషిని భరద్వరాజ్, సీనియర్ లీడర్లు నాతరి స్వామి, చిలుముల శంకర్, దావ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply