Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి..

Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి..
జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాథోడ్ భీమ్రావు
Sevalal | ఉట్నూర్, ఆంధ్రప్రభః అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్ లీలా మైదానంలో ఈనెల 18వ తేదీన ,అధికారికంగా శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లాలోని లంబాడి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అదిలాబాద్ జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాథోడ్ భీమ్రావు నాయక్, ప్రధాన కార్యదర్శి చవాన్ వినాయకరావు, గౌరవ అధ్యక్షులు జాదవ్ కృష్ణా నాయక్, లంబాడి జేఏసీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ జగన్ నాయక్ అడ్వకేట్ ,బానోత్ రామారావు, ఉమ్మడి జిల్లా ముఖ్య సలహాదారులు జాదవ్ రామ్ కిషన్ నాయక్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ నాయక్, ఆడే సురేష్ ,రాథోడ్ సురేష్ ,రాథోడ్ హిరాలాల్ నాయక్ పేర్కొన్నారు.
ఉట్నూరులో నిర్వహించిన సన్నహాక సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు సంస్కృతి సంప్రదాయాలతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ,కార్మికులు, కర్షకులు , యువతి, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు ,అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బంజారా నాయకులు జాదవ్ రెడ్డి నాయక్,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు, రాథోడ్ ఉత్తమ్, జేఏసీ మాజీ అధ్యక్షులు, జాదవ్ బలరాం, జాదవ్ సుభాష్ ఆడే నూర్ సింగ్ నాయక్, రాథోడ్ గణేష్, జాదవ్ అంబారావు , ఆడే సతీష్ ,జాదవ్ శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
