Sub Collector | 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం

Sub Collector | 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం
Sub Collector | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన వంశీకృష్ణ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ మనోజ్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. 2వ వార్డు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల చెంతనే ఉంటానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తానని, 2వ వార్డును మున్సిపాలిటీలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
