Congress Party | సామాజిక సేవ టూ కౌన్సిలర్ గా..

Congress Party | సామాజిక సేవ టూ కౌన్సిలర్ గా..
- వైస్ ఛైర్మన్ గా పల్లెర్ల వెంకన్న
- మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ లో సేవా కార్యక్రమాలతో అరంగేట్రం…
- 35 ఏండ్ల చిన్న వయసులోనే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి..
Congress Party, మోత్కూర్, ఆంధ్రప్రభ : సామాజిక సేవలో నిమగ్నమై.. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ.. నిత్యం పేద ప్రజల సంక్షేమం, దేవతా విగ్రహాలు, అన్నదానం, ఆపదలో ఆర్ధిక సహాయం చేస్తూ మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ లో సైతం కీలక పాత్ర పోషించిన పల్లెర్ల వెంకన్న ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించకున్నా.. ప్రజా సేవలో ఉన్నప్పటికీ.. ఆ ప్రజల ఆశీర్వాదంతో 1 వ వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 35 ఏండ్ల చిన్న వయసులోనే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని సైతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పగించనుండడంతో.. పల్లెర్ల వెంకన్నకు మోత్కూర్ మున్సిపాలిటీలో అనూహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించి.. అన్ని రకాల కష్టాలను చూసిన వెంకన్న.. ప్రజల కష్టాలను తీర్చి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. స్వతహాగా మృదుస్వభావిగా కొనసాగుతున్న వెంకన్న.. మున్సిపల్ వైస్ చైర్మన్ గా తన పదవీ బాధ్యతలు మోత్కూర్ ప్రజలకు నీతి, నిజాయితీగా అందించాలని, పాలనలో పారదర్శకత ప్రదర్శించాలని, మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మున్సిపల్ ప్రజలు, రాజకీయ మేధావులు, శ్రేయోభిలాషులు, విద్యార్థి, యువత అభిప్రాయ పడుతున్నారు.
