ఘనంగా మహా శివరాత్రి మహోత్సవ వేడుకలు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ లో శ్రీ సిద్దేశ్వర్ సంస్థాన్ శ్రీ పరమహంస సద్గురు పూలజీ బాబా ధ్యాన కేంద్రం లో రెండు రోజులపాటు నిర్వహించే మహా శివరాత్రి వేడుకలను ఆదివారం శ్రీశ్రీశ్రీ సద్గురు పూలజీ బాబా సమాధి పూజ చేసి బాబా సతీమణి ఇంగిలే దుర్పాత బాయి తనయుడు కేశవ్ రావు వమాన్ ఇంగిలే చేతుల మీదుగా పూజ చేసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ధ్వజారోహన ధ్యాన ధారణతో కార్యక్రమం తో శివరాత్రి ఉత్సవాల వేడుకలను వారు ప్రారంభించారు. ధ్యాన మందిరంలో బాబా సమాధి దర్శనం కొరకు భక్తులు భారీగా తరలివచ్చారు.

మహారాష్ట్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమం సంస్థాన్ కమిటీ తరుపున నిర్వహించడం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జర్గాకుండా సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ బారి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ గౌరవ ఆద్యుక్షుడు ఇంగిలే వమాన్ దాదా, తహసీల్దార్ అడ బిర్సావ్, ఆదిలాబాద్ రాయ్ సెంటర్ జిల్లా సార్మెడి మేస్రం దుర్గు పటేల్, గంగారాం, స్థానిక సర్పంచ్ కందారే లక్ష్మీ బాలాజీ, సిద్దేశ్వర్ సంస్థాన్ కార్యదర్శిలు దాదా రావు, దూక్రే సుభాష్, గ్రామ పటేళ్లు గంగాధర్, రంగారావు, పూసమ్ హన్మంతరావు, దంబి పటేల్, ఉద్యోగస్తులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకలకు వచ్చి భక్తులకు సంస్థాన ఆధ్వర్యంలో సౌకర్యాలు, భోజన వసతి కల్పించారు. ఈ వేడుకలలో గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply