కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం 22వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తరిగంగాధర్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా మధ్యాహ్నం ఆలయ అర్చకులు వెంకన్న పంతులు ఆధ్వర్యంలో శివపార్వతుల స్వామి వారి కళ్యాణం ఉత్సవంను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ ఉప సర్పంచ్ కమ్ముల లక్ష్మీ స్వామి లింగాపూర్ పిఎసిఎస్ డైరెక్టర్లు పి రాజేశ్వర్ రెడ్డి జి మల్లేష్ మాజీ సర్పంచ్ బొంగు జమున గంగాధర్ గౌడ్ ఆలయ కమిటీ అధ్యక్షులు తరి గంగాధర్ ఉపాధ్యక్షులు కసుల సతీష్ మాదాసు పెద్దోళ్ల నరసయ్య కోశాధికారి బి రంజిత్ గౌడ్ ప్రధాన కార్యదర్శి ముసుకు రాజేందర్ రెడ్డి లింగాపూర్ విడిసి ప్రెసిడెంట్ మాదాసు రాజేశ్వర్ స్థానిక గ్రామ పెద్దలు నాయకులు యువకులు మహిళలు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
