అందరికీ ఆదర్శం మహాగం ఆదివాసి గ్రామం

అందరికీ ఆదర్శం మహాగం ఆదివాసి గ్రామం

  • 55 ఏళ్లుగా కొనసాగుతున్న సామూహిక వివాహాలు
  • ఆ గ్రామంలో ఏళ్ల తరబడి మద్య మాంసాహారం నిషేధ యజ్ఞులు
  • మహాగాం అన్ని గ్రామాలకు స్ఫూర్తిదాయకం
  • నేడే సామూహిక వివాహాలకు ఏర్పాట్లు సిద్ధం

జైనూర్ / సిర్పూర్ (యు ), ఆంధ్రప్రభ ; కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు ) మండలంలోని ఆదివాసి గ్రామమైన మహాగం అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆ గ్రామంలో సరోజీ మహారాజ్ 1965 ముందు గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలో గురుదేవ్ సేవాశ్రమం ఏర్పాటు చేసి ఆదివాసీలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన శిష్యురాలైన జంగుబాయి సేవకురాలుగా పనిచేస్తూ మహాగాంలోని ఆదివాసి ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు.

వారు చేసిన కృషికి మహాగం గ్రామంలోని గుట్టఫై శివాలయం నిర్మించారు. అప్పటినుండి ఆ గ్రామంలో మహాశివరాత్రి రోజు శివరాత్రి వేడుకలతో పాటు మరో రోజు సామూహిక వివాహల కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆశ్రమంలో 1965 నుండి సామూహిక వివాల కార్యక్రమం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మరుసటి రోజు నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ పెద్దలు, మహాగామ్ సర్పంచ్ సెద్మకి జానే రావు తెలిపారు.

అప్పటినుండి ఆ గ్రామంలో 55 ఏళ్ల క్రితం నుండి మద్యపానం నిషేధంతో పాటు గ్రామంలో మాంసాకృతులు తినకుండా నిషేధించారు. సూరోజీ మహారాజ్, జంగు భాయి చేసిన ఆధ్యాత్మిక కృషివల్లే ఆ గ్రామంలో చాలా మార్పులు రావడం అప్పటినుండి ఆ గ్రామం ఆదర్శంగా నిలవడం జరుగుతూనే ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు గురుదేవ్ సేవాశ్రమంలో 545 పైగా సామూహిక వివాహాలు నిర్వహించి ఆ గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామంలో ఏళ్ల తరబడి మధ్య నిషేధం మాంసాహార నిషేధం కొనసాగుతుంది. మహాగంలో గిరిజన సంక్షేమ శాఖ బాలికల అశ్రమోన్నత పాఠశాల ఉన్నప్పటికీ ఆ పాఠశాలలో కూడా మాంసం గుడ్లు వండడం విద్యార్థులకు తినిపించడం నిషేధించినట్లు గ్రామ పెద్దలు, సర్పంచ్ జానేరావ్ తెలిపారు.

భావ్య ప్రపంచానికి తెలియని ఆ గ్రామ కట్టుబాట్లు

ఆదివాసి గ్రామమైన మహాగంలో 1965 నుండి సూరోజ్ మహారాజ్, సేవకురాలు జంగు భాయి ఆదివాసీల్లో మార్పుల కోసం చేసిన సేవలు కట్టుబాట్లు ఇంకా భావ్య ప్రపంచానికి తెలియకుండా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఆ గ్రామంలో మద్య నిషేధం మాంసాహార తినడం నిషేధం తో పాటు మరికొన్ని కట్టుబాట్లు ఆదివాసి విద్యార్థులకు అప్పటినుండి విద్యాబోధన ఆధ్యాత్మిక సూచనలు కొనసాగుతూనే ఉన్నాయి. వారు చూపిన మార్గాలు కట్టుబాట్లు ఇంకా భావ్య ప్రపంచానికి తెలియకుండా ఉన్నాయని గ్రామ పెద్దలు సర్పంచ్ జానే రావు తెలిపారు.

సేవ మార్గాలను కొనసాగిస్తున్న సంస్థాన్ పీఠాధిపతి మెస్రం కైలాస్

మాహగాంలోని సూరజ్ మహారాజ్ జంగు భాయ్ గురుదేవ్ సేవ సంస్థాన్ కార్యక్రమాలను ఆ సంస్థాన్ పీఠాధిపతి మెస్రం కైలాస్ చాలా సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో సురోజీ మహారాజ్ జంగు భాయి చూపిన ఆధ్యాత్మిక మార్గాలను కార్యక్రమాలను కొనసాగించేలా కృషి చేస్తున్నారు. వారి స్ఫూర్తితో వారు చూపిన మార్గాలను గ్రామంలో కొనసాగిస్తామని నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తామని పీఠాధిపతి మెస్రం కైలాస్ పేర్కొంటూ ఆచరణలో పెడుతున్నారు.

యువ సర్పంచ్ గా కట్టుబాట్లను పాటిస్తా
నూతన సర్పంచ్ సేడమ్మకి జానే రావు

మహాగామ్లో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న కట్టుబాట్లు ఆచారాలు కొనసాగిస్తూ మహాగాం అభివృద్ధికి కృషి చేస్తానని మహాగం నూతన సర్పంచ్ చెడమ్మకి జానే రావు ఆంధ్రప్రభ తో తెలిపారు. మాగం ప్రజలు తనకు ఆదరించి సర్పంచ్గా గెలిపించాలని అదే స్ఫూర్తితో సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు.

నేడు జరిగేసామూహిక వివాహాల ఏర్పాట్లు సిద్ధం

ప్రతి ఏడాది మాదిరిగా శివరాత్రి సందర్భంగా ఈ నెల 16న మహాగంలోని సురోజ్ మహారాజ్ గురుదేవ్ సేవా ఆశ్రమం ముందు సోమవారం నిర్వహించే 25 సామూహిక వివాహల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు మాహాగం సర్పంచ్ జానే రావు వివాహల నిర్వాహకులు తెలిపారు. ఈసారి జరిగే సామూహిక వివాహాలకు దాతలు ముందుకు వచ్చి సహకరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply