india| ఇండియా గెల‌వాలి..

india| ఇండియా గెల‌వాలి..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ జట్లు తలపడబోతున్నాయి. కొలొంబోలో రాత్రి 7 నుంచి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో దాయాది జట్టుపై టీమ్​ఇండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. భారత్‌ గెలవాలని కోరుతూ పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉండటంతో వర్షం అంతరాయం కలగకూడదని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని గంగా ఘాట్‌ దగ్గర ప్రత్యేక హారతి ఇచ్చారు. ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరిగా సాగే అవకాశం ఉందని కొందరూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫామ్‌, బలం చూసుకుంటే భారత్‌ సునాయసంగా విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply