Shivratri |విభూతి భస్మం తో శివలింగ అలంకరణ

Shivratri |విభూతి భస్మం తో శివలింగ అలంకరణ

  • శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందర్శన

  • Shivratri | మోత్కూర్, ఆంధ్రప్రభ; శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని స్థానిక శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురోహితులు పారునంది లక్ష్మణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విభూతి భస్మం తో శివ లింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మహా శివరాత్రి పురస్కరించుకుని భక్తుల దర్శనార్థం శివునికి ఇష్టమైన విభూతి భస్మం తో శివ లింగాన్ని అలంకరిచినట్లు పురోహితులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఈ లింగాన్ని చూడడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే మహా శివుని అనుగ్రహం ఉంటుందని వివరించారు.

Leave a Reply