Public | ప‌రీక్ష‌ల‌కు వెళ్ల‌బోయే ముందు…

Public | ప‌రీక్ష‌ల‌కు వెళ్ల‌బోయే ముందు…

Public | చల్లపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : చల్లపల్లి విజయ క్రాంతి జూనియర్ కాలేజీలో శనివారం ఉదయం సరస్వతి హోమం నిర్వహించారు. కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షలలో అందరూ ఉత్తీర్ణత సాధించాలని ఆరోగ్యవంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కళాశాల ప్రిన్సిపాల్ దుట్టా శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, లెక్చరర్స్ తో పాటు అవనిగడ్డ ఎస్ వి ఎల్ క్రాంతి జూనియర్ కళాశాల అధినేత దుట్టా ఉమామహేశ్వరరావు చల్లపల్లి విజయ క్రాంతి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ దుట్టా శివరామ ప్రసాద్ ల దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే కాలేజీలో చదువుకునే విద్యార్థులు సరస్వతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి ఎంపీపీ కోట విజయ రాధిక, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, చల్లపల్లి పంచాయతీ ఉపసర్పంచ్ మమ్మనేని రాజకుమార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Public |

చల్లపల్లి క్రాంతి జూనియర్ కాలేజీలో ప్రతి సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు వెళ్లబోయే ముందు కాలేజీలో సరస్వతీ హోమంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులందరూ రాయబోయే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని అందరూ సంతోషంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించటం గమనార్హం.

Public |
Public |

click here to read more : English Spell | నేషనల్ స్పెల్ బీ పోటీలకు ఎంపిక‌….

click here to read more :

Leave a Reply