February 14 | దామోదరం సంజీవయ్యకు నివాళులు…

February 14 | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దేశం గర్వించ తగిన మహనీయుడు, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు దామోదరం సంజీవయ్య అని జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నం యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతంలో సాధారణ కుటుంబంలో జన్మించి తన కృషి, పట్టుదలతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని, కష్టసాధ్య పరిస్థితులను జయించి ప్రజాసేవలో అగ్రగామిగా నిలిచిన నాయకుడిగా సంజీవయ్య పేరు చిరస్థాయిగా నిలిచిందన్నారు.

ఫిబ్రవరి 14, 1921న జన్మించిన దామోదరం సంజీవయ్య 1960 జనవరి 11 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశ చరిత్రలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన ఘనత విశిష్టమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆయన చేసిన సేవలు ఒక్క తరం లేదా రెండు తరాలకు మాత్రమే పరిమితం కాకుండా తరతరాలకు ప్రయోజనం చేకూరే విధంగా పునాదులు వేసిన నాయకుడని జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

దేశం మరియు రాష్ట్ర అభివృద్ధికి సంజీవయ్య గారు చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. అనేక రంగాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశపెట్టిన సంస్కరణలు నేటికీ ప్రజలకు మేలు చేస్తున్నాయని తెలిపారు.

అనంతరం డిఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య గారి సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. భారత రాజకీయాల్లో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. సాధారణ నేపథ్యం నుంచి దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగిన సంజీవయ్య గారు క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ప్రతి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సామాజిక సమానత్వం మరియు పేదల అభ్యున్నతే లక్ష్యంగా సంజీవయ్య గారు చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా వక్తలు ప్రస్తావించారు. 1960ల దశకంలో భూమి యాజమాన్యమే ఆర్థిక భద్రతకు మూలమని గుర్తించి భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అధిక భూములను పేదలకు పంపిణీ చేసే విధంగా ఈ చట్టం రూపుదిద్దుకోవడం ద్వారా భూవిభజనకు పునాది పడిందని పేర్కొన్నారు. నేటి భూ సంస్కరణల కార్యక్రమాలకు ఆయన చర్యలు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు.

ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నం యుగంధర్ మాట్లాడుతూ వితంతులు, వృద్ధుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం బాధ్యత వహించాలనే దృక్పథంతో దేశంలో తొలిసారిగా పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టిన నేత సంజీవయ్య గారేనని తెలిపారు. ఈ విధానం అనంతరం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని చెప్పారు. కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పరిశ్రమల కార్మికుల సంక్షేమం కోసం తప్పనిసరి బోనస్ చట్టాన్ని తీసుకువచ్చి కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని వివరించారు. ఆధునిక కార్మిక సంస్కరణలకు ఆయన తీసుకున్న చర్యలు బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ అధికారి విక్రమ్ కుమార్, మాల కార్పొరేషన్ ప్రతినిధులు, డివిఎంసీ సభ్యులు ఎస్. మునస్వామి, శంకర్ మడిగా, ధనశేఖర్, ముని కృష్ణ, మురుగేష్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ లోకేష్, ఎన్‌డీఆర్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి. ధనమధరం, ఎస్సీ/ఎస్టీ నాయకులు మేరీ, నాగరాజు, జి. చెంగలరాయుడు, పార్థసారథి, బాబు తదితరులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత దామోదరం సంజీవయ్యకి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం గౌరవప్రద వాతావరణంలో నిర్వహించారు.