Vikarabad | రైల్వే గేట్ మూసివేత..

Vikarabad | రైల్వే గేట్ మూసివేత..

Vikarabad, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్య గూడా రోడ్లో రైల్వే గేట్ను తాత్కాలికంగా మూసివేశారు. రైల్వే ట్రాక్ కు జరుగుతున్న మరమత్తులు కారణంగా ఈ గేట్ను మూసివేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గాన వెళ్లేవారు ప్రత్యామ్నాయంగా అనంతగిరి రోడ్ లో వెళ్లాలని వారు పేర్కొన్నారు. గత కొంతకాలంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే గేట్ల వద్ద రైల్వే ట్రాక్ల పై మరమత్తులు చేస్తుండడంతో పలు రైల్వే గేట్లను మూసివేసి బాగు చేసిన అనంతరం తిరిగి తెరుస్తారు. ప్రజలు ఇది గమనించి ముందుకు సాగాలని అధికారులు తెలియచేశారు.

Leave a Reply