Traffic | మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి…

Traffic | మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి…

  • వేగవంతమైన చర్యలతో ముగ్గురి ప్రాణాలు రక్షణ…

Traffic | విజయవాడ, క్రైమ్, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన చిలకలపూడికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి విజయవాడకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటనలో ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా స్పందించి ముగ్గురి ప్రాణాలను కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం, మహిళ ఇంట్లో చనిపోతానని చెప్పి ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చినట్లు సమాచారం అందింది.

ఈ విషయాన్ని చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూమ్ కు తెలియజేశారు. వెంటనే కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ సంబంధిత పోలీసు స్టేషన్లకు, ట్రాఫిక్ విభాగానికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీధర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భూషణం మహిళ బ్యారేజ్ పై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించారు. వెంటనే చాకచక్యంగా స్పందించి ఆమెను, ఆమె ఇద్దరు పిల్లలను సురక్షితంగా అదుపులోకి తీసుకుని ప్రాణాలను రక్షించారు.

అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు తక్షణ స్పందనతో ముగ్గురి ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని అభినందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అప్రమత్తత ఎంతో కీలకమని పేర్కొన్నారు.

click here to read more : Anudeep | సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి..

click here to read more

Leave a Reply