ఘనంగా సరోజిని నాయుడు జయంతి వేడుకలు..

దండేపల్లి, ఆంద్రప్రభ : సరోజిని నాయుడు జయంతి వేడుకలను పురస్కరించుకుని, దండేపల్లి మండలంలోని తాళ్లపేట,గుడిరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు జయంతిని వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, సరోజినీ నాయుడు భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, గొప్ప కవయిత్రి, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన మహనీయురాలని పేర్కొన్నారు.

ఆమె ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోని వారి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంగ్ల ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ వారిని శాలువాలు, స్మారక చిహ్నాలతో సన్మానించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారుతెలిపారు.అనంతరం పాఠశాల విద్యార్థినికి సరోజిని నాయుడు వేషధారణ ధరించారు,ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయులు మల్లూరి, శ్రీనివాస్, ఉపాద్యాయులు, బండారి శ్రీనివాస్, బి రాజశేఖర్, ఎం అనిత, సల్మా,పి లచ్చన్న,కే నరేందర్,ఏ ఖండు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply