ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ ఘన విజయం!

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 29వ వార్డు అత్యంత ఉత్కంఠకు వేదికైంది. కడవరకు హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడి పున్నంచందర్ (పున్నం కాకా) తన సమీప ప్రత్యర్థులపై ఘన విజయం సాధించి, కౌన్సిల్‌లో అడుగుపెట్టారు.

త్రిముఖ పోరులో ‘పున్నం’ పైచేయి
ఈ వార్డులో ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. తుది ఫలితాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి పున్నంచందర్‌కు 326 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి 319 ఓట్లతో గట్టి పోటీని ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి 199 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కేవలం 7 ఓట్ల స్వల్ప మెజారిటీతో పున్నం కాకా విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.

వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉంటా
విజయం ఖాయం కావడంతో 29వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన వార్డు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి, నిరంతర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply