Anudeep | సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి..

Anudeep | సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఇరువరంలో కారుని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుదీప్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్వగ్రామం గుడిపాల మండలం రామాపురం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
