Brahmotsaval | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన సిద్ధులగుట్ట …

Brahmotsaval | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన సిద్ధులగుట్ట …
ఈ నెల 13 నుంచి 16వరకు బ్రహ్మోత్సవాలు …
Brahmotsaval | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ: ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన మండలంలోని కొడవటూరు సిద్ధుల గుట్ట స్వయంభు సిద్ధేశ్వరాలయం మహా శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాల కు ముస్తాబయింది.. రేపు 13 నుంచి 16 వరకు భక్త జనం మధ్య బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. భక్తుల కొంగు బంగారంగా కీర్తించబడు తున్న సిద్ధులగుట్ట లింగాకారంలో ఉండి నంది ఆకారంలో భక్తుల కోర్కెలను తీరుస్తోంది. కొండ సోరికల్లో వెలసిన సిద్ధేశ్వరాలయంలోని స్వయంభూ శివలింగం ప్రతీ సంవత్సరం చింతాకు పరిమాణంలో పెరుగుతూ నిత్య పూజలను అందుకుంటోంది.
ఆలయం లో గణపతి, భైరవుడు, నవగ్రహాల దేవాలయాల తోపాటు గుట్ట నుంచి బండనాగారంలోని శ్రీ రామ లింగేశ్వరాలయం, కొన్నే గజగిరి గుట్ట, కొలనుపాక లోని సోమేశ్వరాలయానికి సారంగ మార్గాలూ ఉన్నాయి. గుట్టలో 41 రోజులు ఉండి పూజలు చేసిన వారికి పలురకాల రోగాలు నయం అవుతాయని భక్తులకు అద్వారా నమ్మకం ఉంది.. కోరిన కోరికలు తీరుతాయని ప్రజల విశ్వాసం. గుట్టపై గుండాల్లోని నీరును చేలల్లో చల్లితే ఎలాంటి చీడపీడలు ఆశించవని రైతులు నమ్ముతారు.
ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో రోజువారి కార్యక్రమాలు జరుగుతాయి. శివపార్వతుల కళ్యాణం, అగ్నిగుండాల ప్రవేశం,వీర భద్రుడి పూజలు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉత్సవాలు నిర్వహించేందుకు కార్య నిర్వాహకులు చిందం వంశీ , ప్రధాన పూజారి ఓం నమశ్శివాయ , ఆలయ జూనియర్ అధికారులు శ్రీనివాస్ , లక్ష్మీకాంత్ రెడ్డి, సిబ్బంది భాను ప్రకాష్ రెడ్డి, అర్చకులు. ఆలయ కమిటీ సిబ్బంది బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు…
