TG | మాజీ ఎమ్మెల్యే సురేందర్ అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో…

TG | మాజీ ఎమ్మెల్యే సురేందర్ అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో…
TG | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో ఎమ్మెల్యే మదన్మోహన్ ఆయన అనుచరులు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారని ఇదేమిటైన ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను అక్రమ అరెస్టు చేసి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ అరెస్టును నిరసిస్తూ నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై బీఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సురేందర్ అరెస్ట్ చేసిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడం వల్ల రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, తాడ్వాయి మండల నాయకుడు కపిల్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఒడిపోతున్నామని భయంతో దౌర్జన్యానికి దిగుతున్నారని, పోలింగ్ కేంద్రాలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ వెళ్లడం విరుద్ధమని ప్రశ్నించినందుకు సురేందర్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం లో భారీ వర్షాల వల్ల 4 వేల ఎకరాల పంటలు మునిగిపోయి రైతులు నష్టపోతే నేటికీ నాలుగు పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం అన్నారు. రైతు భరోసా పోయింది, ఎలాగూ ఒడిపోతామన్న భయంతో దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ పద్దతిని ప్రజలు అన్ని గమనిస్తున్నారని గుర్తుచేశారు.
