Municipal Elections | బారులు తీరిన ఓటర్లు..

Municipal Elections | బారులు తీరిన ఓటర్లు..

Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు సంబంధించి 26 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం 7 గంటల నుండి బారులు తీరుతున్నారు. మోత్కూర్ లోని ప్రాథమిక పాఠశాలలో 17, 18 బూతులలో ఓటర్లను ఆకర్షించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆకర్షనీయంగా అందంగా అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యువతీ, యువకులు సెల్ఫీ పాయింట్ వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సెల్ఫీ దిగుతున్నారు.

ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సైతం అదనపు బలగాలతో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు తమ గుర్తులకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మోత్కూరు 14,30083 ఓట్లగాను 1835 ఓట్లు పోలవగా 12.73% పోలింగ్ నమోదైనట్లు కమిషనర్ తెలిపారు.

Leave a Reply