Followup | పొట్ట కూటికోసం వచ్చి మట్టిలో కలిశారు
ఎల్బీనగర్ లో విషాదం
సెల్లార్ పనులు చేస్తుండగా విరిగిన మట్టిగడ్డలు
ముగ్గురు కూలీలు సజీవ సమాధి..ఒకరికి తీవ్రగాయాలు
మృతులందరూ బీహార్ వాసులుగా గుర్తింపు
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ ప్రాంతంలో నేటి ఉదయం ఓ హోటల్ సెల్లార్‌లో నిర్మాణ పనులు చేపడుతుండగా గోడ కూలి మట్టిగడ్డలు పని చేస్తున్న కూలీలపై పడ్డాయి. ఈదుర్ఘటనలో ముగ్గురు కూలీలు మట్టిపెడ్డల కింద పడి చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది స్పాట్‌కి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలన బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. ఇదే ప్రమాదంలో గాయపడిన దశరద్ ని చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు. మరణించిన, గాయపడిన వారందరూ బీహార్ వాసులుగా పోలీసులు వెల్లడించారు..
