sudha l 8 వ వార్డు ప్రజల ఆదరణతో విజయం సాధిస్తా..

sudha l 8 వ వార్డు ప్రజల ఆదరణతో విజయం సాధిస్తా..

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు

sudha l జనగామ, ఆంధ్రప్రభ; ఎనిమిదో వార్డులో ప్రజల ఆదరణ ,మద్దతు సంపూర్ణంగా లభించిందని దీంతో తమ గెలుపు ఖాయమని బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు ధీమా వ్యక్తం చేశారు. 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియాతో అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా 8వ వార్డు అంతా తిరిగామని, వార్డులోని సమస్యలు ప్రజలు వివరించారని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వార్డు ప్రజలతో తమ కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందని, ఆ పరిచయాలు, స్నేహాలు తమ గెలుపుకు నాంది పలుకుతాయని అన్నారు.

ప్రత్యర్ధులు ఎన్ని కుట్రలు చేసినా తన విజయం తధ్యమని వారు తెలిపారు. ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ ఆదేశానుసారం ప్రజల కోరిక మేరకు ఎనిమిదవ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని తెలిపారు. ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్త ఉత్సహంతో గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. వార్డు సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులు చేపడతామని ఆమె తెలిపారు.ప్రజల ఆదరణ బాగుందని, తమ గెలుపు ఖాయమని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply