Shiva krishna l ప్రజా సేవకొరకు వస్తున్నా ఆదరించి ఓటువేసి గెలిపించండి..

Shiva krishna l ప్రజా సేవకొరకు వస్తున్నా ఆదరించి ఓటువేసి గెలిపించండి..
18వ వార్డు బిజెపి అభ్యర్థి ఏతం శివకృష్ణ
Shiva krishna l చెన్నూర్, ఆంధ్రప్రభ; చెన్నూరు 18వార్డులో నిత్యం అందుబాటులో ఉంటు ప్రజాల కష్ట సుఖలలో తోడుగా ఉండి సేవాలాందిస్తానని 18వ వార్డు బిజెపి అభ్యర్థి ప్రజలను ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార ముగింపు లో భాగంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశప్రధాని మోదీ పేద ప్రజలకు అందిస్తున్న పథకాలు ప్రతికుటుంబానికి చేరేలా కృషి చేస్తూ స్థానిక సమస్యలు పరిస్కారానికి ప్రజల పక్షాన మున్సిపల్ సమావేశాలలో గళం వినిపించి పరిష్కరిస్తానన్నారు.దేశ ప్రగతి దృష్టిలో పెట్టుకొని ప్రజలు బిజెపి కమలం గుర్తు కు ఓటు వేయాలని వేడుకున్నారు.
