CM Cup | రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

CM Cup | రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

CM Cup | కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : కడం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శకుంతల తెలిపారు.

ఈనెల 7, 8, 9 తేదీలలో జిల్లా స్థాయి పోటీలు నిర్మల్ లో జరగా పాఠశాలకు చెందిన హరిప్రియ కబడ్డీలో, మేఘన వాలీబాల్ టీమ్లకు కెప్టెన్ గా ఎన్నికై ఉత్తమ ప్రతిభ కనబరిచి సీఎం కప్ స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారు. సాఫ్ట్ బాల్ బేస్ బాల్‌ల్లో లావణ్య, గంగోత్రి, అక్షయ, మిన్ను, వినీత, అక్షిత, రాజేశ్వరి నిర్మల్ జిల్లా తరఫున పాల్గొని రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ శకుంతల, పి.ఈ.టి సునీత, రాధ, వైస్ ప్రిన్సిపల్ అమీనా, కళ్యాణి ఉపాధ్యాయ బృందం అభినందించారు.

విద్యార్థులు చదువుల్లో రాణిస్తూ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో చదువుతోపాటు క్రీడలను సమానంగా ప్రోత్సహిస్తూ మరిన్నిశిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Leave a Reply